28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

కేరళలో విమాన ప్రమాదం…ప్రముఖుల దిగ్భ్రాంతి

కేరళలోని కోజికోడ్ కరీపూర్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా  విమానం  రన్ వే పై నుంచి జారి 35 అడుగుల లోయలోకి పడింది. ఈ క్రమంలో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 20 మంది దుర్మరణం పాలయ్యారు. 120 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని దవాఖానలకు తరలించారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటల 41 నిమిషాల సమయంలో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో విమానంలో 190 మంది ఉన్నారు. వీరిలో 174 మంది ప్రయాణికులు, 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రమాదం జరిగే సమయంలో వర్షం కురుస్తోంది.దీని వల్లే రన్ వే పై చక్రాలు  జారి ఉంటాయని భావిస్తున్నారు. మల్లపురం, వయనాడ్ నుంచి రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టాయి.

AIEAXB 1344 బోయింగ్ 737 విమానం ప్రమాదానికి గురైనట్లు పౌర విమానయాన నియంత్రణ సంస్థ ప్రకటించింది. పదో రన్ వేపై ల్యాండ్ అయిన తర్వాత విమానం రన్ వే చివరి వరకు వెళ్లిందని, అనంతరం లోయలోకి పడిపోయిందని పేర్కొంది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ విమానం దుబాయ్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు అధికారులు చెప్పారు. క్రాష్, ల్యాండింగ్ వల్ల తమ నెట్ వర్క్ పై ప్రభావం పడినా..వందే భారత్ మిషన్ కొనసాగుతుందని తెలిపింది.

అటు కేర‌ళ ఎయిరిండియా విమాన ప్రమాద ఘ‌ట‌న‌పై ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేరళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌తో ప్రధాని మాట్లాడారు. ప్రమాద ఘ‌ట‌న గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోజికోడ్‌లో జ‌రిగిన‌ విమాన ప్రమాద ఘ‌ట‌నపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...