కోల్ కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వరుస బీజేపీ నేతల హత్యలను నిరసిస్తూ కమలం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్ హత్యారాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆరోపిస్తున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి నబన్నాలోని రాష్ట్ర సచివాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడే కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నగరం అంతటా 144 సెక్షన్ విధించారు. బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు.