17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

కోల్‌కతా పై పంజాబ్‌ విజయం

ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విజృంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ తో  జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన పంజాబ్‌.. సీజన్‌లో వరుసగా ఐదో విజయాన్ని అందుకుంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. గేల్, మన్ దీప్ సింగ్ హాఫ్ సెంచరీలు సాధించటంతో కోల్ కతాను చిత్తు చేసింది. కేవలం 29 బంతుల్లో 51 పరుగులో విధ్వంసం సృష్టించిన క్రిస్ గేల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాన్ అవార్డు లభించింది.                             

తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఆదిలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం పది పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.  నితీష్ రాణా, దినేష్ కార్తిక్ డకౌట్ కాగా రాహుల్ త్రిపాఠి ఏడు పరుగులకే వెనుదిరిగాడు. రెండో ఓవర్ లోనే కార్తిక్, త్రిపాఠిని ఔట్ చేసిన షమీ కోల్ కతాకు షాక్ ఇచ్చాడు. ఆతర్వాత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్‌- కెప్టెన్ మోర్గాన్ కోల్ కతాను ఆదుకున్నారు. శుభ్ మన్ గిల్  57 పరుగులతో రాణించగా.. అతనికి మోర్గాన్‌ 40 పరుగులతో సహకారాన్ని అందించాడు. చివర్లో ఫెర్గ్యూసన్ 13 బంతుల్లో 24 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 149 పరుగులు చేసింది.  పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లు పడగొట్టగా.. రవి బిష్ణోయ్‌, క్రిస్‌ జోర్డాన్‌ తలో రెండు వికెట్లు తీశారు.

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. కేఎల్ రాహుల్, మన్ దీప్ సింగ్ లు తొలి వికెట్ కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 47 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయిన తరువాత క్రీజులోకి వచ్చిన క్రిస్ గేల్… విధ్వంసకర బ్యాటింగ్ తో అలరించాడు. కేవలం 29 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. ఓపెనర్ మన్ దీప్ సింగ్ 45 బంతుల్లో 57 పరుగులతో రాణించాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇది పంజాబ్‌కు ఆరో విజయం కాగా, కేకేఆర్‌కు ఆరో ఓటమి. ఈ మ్యాచ్ తో పంజాబ్  ప్లే ఆఫ్ రేసులోకి దూసుకురాగా .. కోల్ కతా ఆశలకు గండిపడింది.

- Advertisement -

Latest news

Related news

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...

అసోంవాసులను భయపెడుతున్న చిరుతలు

చిరుతలు అసోంవాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నాపంలోని తేజ్పూర్‌ యునివర్సిటీ సమీపంలో పట్టపగలే ప్రజలపై దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా పులి జనం మీదకు విరుచుకుపడడంతొ...