27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

‘క్వారంటైన్‌’ రాష్ర్టాల ఇష్టం

  • నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు
  • మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 24: విమానాలు, రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు ప్రయాణించే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్‌, ఐసోలేషన్‌కి సంబంధించిన నిబంధనల్ని ఆయా రాష్ర్టాలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నది. నిర్ణీత దూరం, మాస్కు ధరించడం, ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరి చేసింది.

నిబంధనలివే.. 

  • ప్రయాణ ప్రాంగణాల్లో ప్రకటించే సూచనలను ప్రయాణికులు తప్పకుండా పాటించాలి.
  • ప్రయాణానికి ముందు, తర్వాత థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్ష తప్పనిసరి. లక్షణాలు లేనివారికే అనుమతి. 
  • ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే దగ్గర్లోని ఐసోలేషన్‌ సౌకర్యం ఉన్న దవాఖానకు తరలించాలి. 
  • తీవ్ర కరోనా లక్షణాలు ఉంటే కొవిడ్‌-19 చికిత్స కేంద్రాలకు తరలించాలి.
  • ఐసోలేటెడ్‌ వార్డుకు తరలించిన తర్వాత ఎవరికైనా నెగిటివ్‌ వస్తే.. వారిని వారంపాటు అక్కడే ఉంచి ఇంటికి పంపాలి. వారు ఆ తర్వాత మరోవారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండేలా జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వాలి.
  • విమానాశ్రయాలు/రైల్వేస్టేషన్లు/బస్టాండ్‌లను తరచూ శానిటైజ్‌ చేయాలి. ప్రయాణికులకు సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
  • విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఇందులో ఏడు రోజుల పాటు సొంత ఖర్చులతో ఇన్‌స్టిట్యూషనల్‌  క్వారంటైన్‌లో, మరో వారంపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.
  • తీవ్ర ఒత్తిడికి గురయ్యే వారు, గర్భిణిలు, కుటుంబంలో మరణం సంభవించిన వారు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, 10 ఏండ్లలోపు పిల్లలు, వారి తల్లిదండ్రులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఉంటుంది. వీరు తప్పనిసరిగా 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

సర్వీసులను వ్యతిరేకిస్తున్న పలు రాష్ర్టాలు..

దేశీయ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై సందిగ్ధత వీడటంలేదు. సోమవారం నుంచి పలు ప్రధాన నగరాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తామని పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌ మాత్రం మరికొంత కాలం తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరుతున్నాయి. విమాన సేవలను ఇప్పుడే ప్రారంభించకూడదని తొలుత పేర్కొన్న మహారాష్ట్ర అనంతరం యూటర్న్‌ తీసుకున్నది. ముంబై విమానాశ్రయం నుంచి 25 విమానాల రాకపోకలకు అనుమతిచ్చింది. మరోవైపు, డ్యూటీ అనంతరం తాము కూడా  క్వారంటైన్‌లో ఉండాలా  వద్దా  అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని పైలట్లు, విమాన సిబ్బంది కోరుతున్నారు.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...