గాలి ద్వారా కూడా కరోనా సోకుతుందని రుజువు చేసింది అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్. కరోనా రోగి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడిన తుంపర్లలో వైరస్ ఉంటుందని సీడీసీ పేర్కొంది. వ్యక్తుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించకపోతే..వైరస్ గాలి ద్వారా ప్రయాణిస్తుందని తెలిపింది. గాలి, వెలుతురు సక్రమంగా ప్రసరించని గదుల్లో వైరస్ ప్రయాణించే అవకాశాలున్నాయని హెచ్చరించింది.