23.6 C
Hyderabad
Saturday, November 28, 2020

గాల్వన్ అమరవీరుల త్యాగాలను వృథా కానివ్వబోము

ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకొని దేశ సేవ చేసేందుకు వాయుసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు ఏయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బదౌరియా. లద్దాఖ్‌లో పరిస్థితులను నిత్యం సమీక్షిస్తున్నామని, అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. గాల్వన్ అమరవీరుల త్యాగాలను ఎట్టిపరిస్థితుల్లోనూ వృధా కానివ్వనీయమన్నారు. రాబోయే రోజుల్లో భారత వాయుసేనకు 300 విమానాలు అందనున్నట్లు చెప్పారు బౌదరియా. దుండిగల్‌ ఏయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన కంబైన్డ్‌ గ్యాడ్యుయేషన్ పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

క్యాడేట్ల నుంచి బదౌరియా తొలి గౌరవ వందనాన్నిస్వీకరించారు. ఈ పరేడ్‌లో 123 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. వారిలో 19 మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. ప్లయింగ్, న్యావిగేషన్‌లలో ఉత్తీర్ణులైన వారికి వింగ్స్ అందించారు ఎయిర్ చీఫ్ మార్షల్. అయితే కరోనా నేపథ్యంలో క్యాడెట్ల కుటుంబ సభ్యులకు పరేడ్‌ను తిలకించేందుకు అనుమతి ఇవ్వలేదు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పలువురు ఏయిర్‌ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు.

గాల్వన్ లోయలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబుతో పాటూ 19 మంది జవాన్లకు నివాళులు అర్పించారు. వారి ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు బదౌరియా. చర్చలు అని చెప్పి…చైనా దాడులకు పాల్పడుతుందన్నారు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎల్‌ఏసీ దగ్గర ప్రతి వేసవిలో తన బలగాల్లో తో శిక్షణ ఇస్తుందన్నారు. ఈ ఏడాది బలగాలను కూడా భారీగా పెంచినట్లు చెప్పారు బదౌరియా.

- Advertisement -

Latest news

Related news

మంత్రి ఎర్రబెల్లి.. ఇంటింటి ప్రచారం

హైదరాబాద్‌ నగరంలో కేవలం టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమయిందని.. పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మీర్‌పేట హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌లో ఆయన ఇంటింటికీ...

రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది : మంత్రి కేటీఆర్

మతాన్ని అడ్డుపెట్టుకొని ఓట్లు రాబట్టకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...