హైదరాబాద్ లో శాంతి భద్రతలు దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నట్లు తమకు స్పష్టమైన సమాచారం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అరాచకశక్తులను అడ్డుకునేందుకు పోలీసు శాఖ పని చేస్తుందని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. విధ్వంసక శక్తుల కుట్రలను ప్రజల మద్దతుతో తాము ఎదుర్కుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు