అమెరికాలో కరోనా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తామంటున్నారు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. చైనా వల్లే ప్రపంచదేశాలు కరోనాతో కకావికలం అవుతున్నాయన్నారు. చేసిన తప్పుకు డ్రాగన్ కంట్రీ భారీ మూల్యం చెల్లించబోతుందన్నారు. కరోనా నుంచి తాను త్వరగా కోలుకున్నానన్న ట్రంప్.. చికిత్సలో ఉపయోగించిన ఔషధాలు బాగా పని చేశాయన్నారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జాన్సన్.. జాన్సన్, మోడరనా వంటి అనేక కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని గుర్తు చేశారు.