అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖరారైంది. వచ్చే ఏడాది.. జనవరిలో రాజకీయ రంగప్రవేశం చేస్తున్నట్టు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

తమిళ ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానులకు.. డిసెంబర్ 31న పార్టీకి సంబంధించిన వివరాలు తెలియజేస్తానని రజినీ అన్నారు. రజినీ రాజకీయ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు ఈ వార్తతో సంతోషంలో మునిగిపోయారు.