జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడికి చెక్ పెట్టాయి బలగాలు. పుల్వామా తరహా కుట్రను భగ్నం చేశాయి. గతేడాది ఫిబ్రవరి 14న సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన ప్రాంతానికి.. 9 కి.మీ. దూరంలో 52 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. కరేవా ప్రాంతంలో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. సింటెక్స్ వాటర్ ట్యాంకులో ఈ పేలుడు పదార్థాలను గుర్తించారు అధికారులు. అదే ప్రాంతంలోని మరో వాటర్ ట్యాంకులో 50 డిటనేటర్లు దొరికాయి.