జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. మొన్నటికి మొన్న ముగ్గురు ముష్కరులను కాల్చి చంపిన బలగాలు..ఇవాళ కుల్గాం జిల్లా చింగం ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ మరో ఇద్దరిని మట్టుబెట్టారు. భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ..మిలిటెంట్లు కాల్పులు జరిపారు. అప్రమత్తం అయిన జవాన్లు ఎదురుకాల్పులు జరిపడంతో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.వరుస ఎన్కౌంటర్లతో జమ్మూకశ్మీరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.