జమ్మూకశ్మీర్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతుంటే తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి జనం బయటికి పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు నేషనల్ సీస్మోలజీ సెంటర్ అధికారులు.