20.9 C
Hyderabad
Saturday, January 16, 2021

జమ్మూ-కాశ్మీర్ లో ఎన్‌కౌంట‌ర్‌… ముగ్గురు ఉగ్రవాదులు మృతి

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భ‌ద్ర‌తాద‌ళాల మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌వ్వ‌గా, ఓ ఏఎస్ఐ క‌న్నుమూశారు. ఉగ్ర‌వాదులున్నార‌నే స‌మాచారంతో శ్రీన‌గ‌ర్‌లోని పంతా చౌక్‌లో శ‌నివారం రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత సీఆర్పీఎఫ్ బ‌ల‌గాలు, స్థానిక పోలీసులు నాకా బందీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదులు పోలీసుల‌పై కాల్పులు జ‌రిపారు. దీంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఓ టెర్ర‌రిస్టు హ‌త‌మవ్వ‌గా, ఇత‌రులు త‌ప్పించుకున్నారు. దీంతో గాలింపు ముమ్మ‌రం చేశారు. అయితే ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఏఎస్ఐ బాబు రామ్ చ‌నిపోయార‌ని క‌శ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

గాలింపు సంద‌ర్భంగా ఈరోజు తెల్ల‌వారుజామున మ‌రో ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుపెట్టాయని వెల్ల‌డించారు. దీంతో మొత్తం ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. మిగిలిన‌వారికోసం గాలింపు కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపారు.    ‌ 

- Advertisement -

Latest news

Related news

స‌మ్మర్ స్పెష‌ల్‌గా రానున్న నార‌ప్ప ‌

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్ననారప్ప సినిమా సమ్మర్ లో తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నది. వెరైటీ పాత్రలు ఎంచుకొని.. ప్రయోగాలు చేయడంలో ముందుండే విక్టరీ వెంకటేశ్, ప్రియమణిలు జోడీగా...

అందరూ కలిసి ఊరికి బర్త్ డే చేశిర్రు

ఇదేం విచిత్రం.. ఎవరైనా మనుషులకు బర్త్ డే చేస్తరు. పైసలున్నోళ్లయితే.. పెంచుకునే కుక్కపిల్లలకు, పిల్లి పిల్లలకు బర్త్ డేలు చేస్తరు. కానీ.. ఊరికి బర్త్ డే చేసుడేంది అని ఆలోచిస్తున్నరా?...

రియల్ హీరో సోనూసూద్ మ్యూజిక్ వీడియో చూశారా..

రియల్ హీరో సోనూసూద్.. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియో ‘పాగ‌ల్ న‌హీ హోనా’లో నటించాడు. ఆర్మీ ఆఫీసర్ గా కన్పించిన ఆ మ్యూజిక్ వీడియో రీల్ హీరోగా కన్పించి తన...

పాక్ కెప్టెన్ బాబర్ మీద లైంగిక వేధింపుల కేసు నమోదు

పాకిస్తాన్‌ క్రికెట్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో లాహోర్‌ అదనపు సెషన్స్‌ కోర్టు...