బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపుల కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నటి పాయల్ ఘోష్ జాతీయ మహిళా కమిషన్ ను కలిసింది. ఇప్పటికే ముంబై పీఎస్ లో కంప్లైంట్ చేసిన ఈ బ్యూటీ..తాజాగా కశ్యప్ చర్యలు తీసుకోవాలంటూ NCWకి ఫిర్యాదు చేసింది. అనురాగ్ కశ్యప్ డ్రగ్స్ కూడా తీసుకుంటారని..ఆ కోణంలో విచారించాలంటూ ఎన్సీబీకి కంప్లైంట్ చేసింది. అయితే.. పాయల్ ఆరోపణలను ఖండిస్తున్నారు అనురాగ్. స్వ ప్రయోజనాల కోసమే ఆమె తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు.