29.3 C
Hyderabad
Monday, March 1, 2021

జులై ఆఖరుకు దేశంలో 10 లక్షల కరోనా కేసులు!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య జులై చివరినాటికి 10 లక్షలకు చేరొచ్చని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేశారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి మున్ముందు మరింతగా విజృంభించే ముప్పుందని హెచ్చరించారు. జులై చివరికల్లా ఢిల్లీలో 5.5 లక్షల కేసులు వెలుగుచూడొచ్చన్నారు. ఇక దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య వచ్చే నెల చివరికల్లా 8 నుంచి 10 లక్షలకు పెరగొచ్చని శివనాడార్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ సమిత్‌ భట్టాచార్య చెప్పారు.  సుదీర్ఘ లాక్‌డౌన్‌ విధించినా ఢిల్లీలో కరోనా వ్యాప్తి పెరిగిందని సీఎస్‌ఆర్‌-ఐఐసీబీ శాస్త్రవేత్త ఉపాసన తెలిపారు. అందులోనూ చాలా కేసుల్లో సంక్రమణ మూలం  తెలియడం లేదని వెల్లడించారు.

- Advertisement -

Latest news

Related news