21.5 C
Hyderabad
Saturday, November 28, 2020

జ‌మ్ముక‌శ్మీర్ లో భూకంపం

దేశంలోని ఉత్త‌రాది రాష్ట్రాల్లో గ‌త కొన్ని రోజులుగా వ‌రుస భూకంపాలు చోటుచేసుకుంటున్నాయి.జ‌మ్ముక‌శ్మీర్‌ లో ఈరోజు తెల్ల‌వారుజామున స్వ‌ల్పంగా భూమి కంపించింది. జ‌మ్ములోని కాత్రాలో శుక్ర‌వారం ఉద‌యం 5.11 గంట‌ల‌కు భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 3.0గా న‌మోద‌య్యింది. క‌త్రాకి తూర్పున 89 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉన్న‌ద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సీస్మోల‌జీ (ఎన్‌సీఎస్‌) ప్ర‌క‌టించింది. వారం రోజుల వ్య‌వ‌ధిలో క‌త్రాలో భూకంపం రావ‌డం ఇది రెండోసారి. జూలై 17న 3.9 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. ఈనెల 8న రాజౌరీలో కూడా 4.3 తీవ్ర‌త‌తో భూమికంపం సంభ‌వించింది. 

- Advertisement -

Latest news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

Related news

చట్టాల రద్దు కోసం.. పట్టుబట్టిన రైతులు

పంజాబ్‌ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు.

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్

బేంగంపేటలోని మ్యారిగోల్డ్‌ హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ...

రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా నందిగామ మేకగూడా బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నందిగామ వద్ద బైపాస్‌ రోడ్డు...

జమ్మూకాశ్మీర్‌లో కోనసాగుతున్న డీడీసీ ఎన్నికల పోలింగ్

జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల తొలి విడుత  పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. జిల్లా అభివృద్ధి మండళ్లు(డీడీసీ), పంచాయితీ ఉప ఎన్నికలకు నేటి నుంచి పోలింగ్ జరగనుంది.ఆర్టికల్‌ 370 రద్దు...