సెప్టెంబర్ 30లోగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయోద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీతో సంప్రదించి, పరీక్షల నిర్వహణకు తేదీలను ఖరారు చేయవచ్చునని తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టేసింది సుప్రీం సుప్రీం. అయిదు సెమిస్టర్లను పూర్తి చేసిన స్టూడెంట్స్ ను సీజీపీఏ పద్ధతిలో పాస్ చేయాలన్న పిటిషనర్ల వాదనలను తొసిపుచ్చింది.