28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

డీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటం  ఆందోళన కలిగిస్తున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి బారిన పడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా  చెంగల్పేట్ జిల్లా చెయ్యూర్‌ నియోజకవర్గ  డీఎంకే ఎమ్మెల్యే ఆర్‌ టీ అరసు కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్ష కోసం శాంపిల్స్‌ ఇచ్చిన అరసు..కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు శనివారం ఉదయం తేలింది. చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. 

అరసు కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టు కోసం శాంపిల్స్‌ ఇచ్చారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డీఎంకేలో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. డీఎంకేలో  కరోనా బారినపడిన మూడో ఎమ్మెల్యే అరసే. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల  డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ మృతిచెందిన విషయం తెలిసిందే

- Advertisement -

Latest news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

Related news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...