18.3 C
Hyderabad
Wednesday, October 28, 2020

ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం…200 గుడిసెలు బుగ్గిపాలు

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని తుగ్లకాబాద్ మురికివాడలోని వాల్మీకి బస్తీలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలియగానే తాము 20 అగ్నిమాపక వాహనాలను తీసుకువచ్చి మురికివాడలో రాజుకున్న మంటలను అదుపు చేశామని ఢిల్లీ డివిజనల్ అగ్నిమాపక శాఖ అధికారి ఎస్ కే దువా చెప్పారు. మంటలను ఫైర్ ఇంజన్లతో ఆర్పామని, తెల్లవారుజామున నాలుగుగంటలకల్లా పూర్తిగా అదుపు చేశామని అగ్నిమాపకశాఖ అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో వాల్మీకి బస్తీలోని 200 గుడిసెలు బుగ్గిపాలయ్యాయి. పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. అధికారులు అగ్నిప్రమాద బాధితులకు సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. తుగ్లకాబాద్ మురికివాడలో ఈ ఏడాది అగ్నిప్రమాదం జరగడం రెండోసారి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. అగ్నిమాపకశాఖ, పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఢిల్లీపై హైదరాబాదీల విజయం

తప్పకగెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 88 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్ ని చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్...

సీఎం చేతుల మీదుగా రేపే ధరణి పోర్టల్‌ ప్రారంభం

మరో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు సీఎం కేసీఆర్‌ ..మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ధరణి...

ప్రారంభమైన బీహర్ తొలి విడత పోలింగ్

బీహార్‌లో  తొలిదశ ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు జిల్లాల్లోని 71  శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగనుంది.  తొలివిడుత...

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్...