21.2 C
Hyderabad
Saturday, November 28, 2020

ఢిల్లీలో రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు

దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు వెలుగుచూస్తుండడంతో ఢిల్లీలో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 32వేలకు చేరవైంది. పెరుగుతున్నకేసులతో వైద్య సౌకర్యాలు కల్పించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఢిల్లీలోని మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల‌ను,హోటళ్లను కోవిడ్ ఆస్పత్రులుగా మార్చాలనే ప్రణాళికతో సహా, పడకల సంఖ్యను పెంచడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వీటికితోడు ప్రగతి మైదానం, టాకటోరా స్టేడియం, ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం, జెఎల్‌ఎన్ స్టేడియం, ధ్యాన్‌చంద్ స్టేడియంలను కూడా మేక్ షిఫ్ట్ హాస్పిటల్స్‌గా మార్చే ప్రయత్నాల్లో ఉంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా వ్యాప్తి ధృష్ట్యా పొరుగు రాష్‌ర్టాలు అప్రమత్తం అవుతున్నాయి. ఢిల్లీ ప్రక్కనే ఉన్న ఫరీదాబాద్, సోనిపట్, గుర్గావ్ త‌దిత‌ర‌ జిల్లాల‌కు ఢిల్లీ నుంచి రాక‌పోక‌లు జ‌రుగుతుండ‌టంతో త‌మ రాష్ట్రంలో మ‌రిన్ని కేసులు పెరిగాయని హ‌రియాణా ప్రభుత్వం అభిప్రాయం వ్య‌క్తం చేస్తోంది.దీంతో ఢిల్లీ సరిహద్దు సీలింగ్  పై సర్కార్‌ చర్చలు జరుపుతోంది.

- Advertisement -

Latest news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

దోబీ ఘాట్‌లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్

రజకులకు దోబీ ఘాట్‌లు ఉచిత కరెంటు అందిస్తాం. దోబీ ఘాట్‌లో ఉండే మోటార్లకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులు : సీఎం కేసీఆర్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. ఓట్లు వేసే ప్రజలు విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.