28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

ఢిల్లీలో హై అలర్ట్…

ఉగ్రవాద దాడులు జరగొచ్చంటూ నిఘావర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీలో హై అలర్ట్ జారీ చేశారు. జమ్మూకశ్మీర్ నుంచి ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నారనే సమాచారంతో అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధానిలో దాడికి ఉగ్రవాదులు పన్నాగం పన్నినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. బస్సు, కారు లేదా టాక్సీ ద్వారా ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి ప్రవేశించవచ్చని ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు ముమ్మరం చేశారు. గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు, బస్సు టెర్మినళ్లు, రైల్వే స్టేషన్ల దగ్గర తనిఖీలు చేపట్టారు. అణువణువూ గాలిస్తున్నారు. ఢిల్లీ బయట కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అన్ని జిల్లాల డీసీపీలు, స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్లు హై అలర్ట్‌ లో ఉన్నాయి. 

- Advertisement -

Latest news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

Related news

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...

జమ్మూకశ్మీర్‌ లో భూకంపం… రిక్టర్‌ స్కేల్‌ పై 4.3గా నమోదు

జమ్మూకశ్మీర్ ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజులుగా భూ ప్రకంపనలతో భయాందోళనకు గురవుతుంటే తాజాగా తెల్లవారుజామున మరోసారి భూకంపం సంభవించింది. తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై...