కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఛలో ఢిల్లీ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. హర్యానా, పంజాబ్ నుంచి దాదాపు మూడు లక్షల మంది రైతులు ఢిల్లీకి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. హర్యానా నుంచి ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయత్నించిన రైతులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. వారిని నిలువరించేందుకు వాటర్ కెనాన్లు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు అన్నదాతలకు గాయాలయ్యారు. రైతులపై పోలీసుల లాఠీచార్జ్‌ను ఖండించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు.