తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఐదు గంటలపాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వానలతో చెన్నై, మదురై, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. పుదుకోట్టై, తిరుచ్చి, తంజావూరు, ధర్మపురి, శివగంగై, దిండుకల్, మదురై, నామక్కల్, తిరువారూర్ జిల్లాల్లో జనజీవనం స్థంభించింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రోడ్లపై పడవలు వేసుకుని తిరుగుతున్నారు జనం. ఇటు తిరుపోరూర్, కాంచీపురం, కల్పాక్కం, మహాబలిపురంలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పెరియకుళం సమీపంలోని కుంభకరై జలపాతానికి వరద పోటెత్తింది. ఇదిలా ఉంటే రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది.