19.4 C
Hyderabad
Monday, November 30, 2020

దుబ్బాకలో డబ్బుల దంగల్

ఉల్టా చోర్ కోత్వాల్ కో డాంటే అన్నట్టుంది దుబ్బాకలో బీజేపీ పరిస్థితి. ఎలాగూ గెలిచే అవకాశం లేదు. కనీసం డిపాజిట్ వస్తుందా అంటే అదీ కూడా డౌటే. ఈ పరిస్థితుల్లో కమలం పార్టీ బరితెగించి, అరాచకాలు సృష్టిస్తోంది.  ఓటమి తప్పదని తెలిసి,  ప్రలోభాలకు తెరతీసింది. ఓటర్లకు పంచడానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువు అంజన్ రావు ఇంట్లో దాచిన 18 లక్షల 47 వేలను పోలీస్‌, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సిద్దిపేటలోని లెక్చరర్‌ కాలనీలో ఉండే దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు, మామ గోపాల్‌ రావు.. సమీప బంధువు సురభి అంజన్‌ రావు ఇండ్లల్లో అధికారులు తనిఖీలు చేశారు. దుబ్బాక ఎన్నికల్లో పంచేందుకు జితేందర్‌ రావు అనే వ్యక్తి తన డ్రైవర్‌ ద్వారా ఈ డబ్బు పంపారని అంజన్‌ రావు ఒప్పుకున్నారు. దీంతో అధికారులు ఆ డబ్బును సీజ్‌ చేశారు. వన్‌ టౌన్‌ సీఐ సైదులు, సిద్దిపేట అర్భన్‌ తహసీల్దార్‌ విజయ్‌ సాగర్‌ ఆధ్వర్యంలో పంచనామా జరిగింది. నిజం బయటకు వస్తే ఓటర్లు చీ కొడుతారని గుర్తించిన రఘునందన్‌ రావు.. బీజేపీ నేతలు వెంటనే భారీ హైడ్రామాకు తెరలేపారు. సిద్దిపేటతో పాటు ఇతర మండలాలకు చెందిన పార్టీ కార్యకర్తలకు ఫోన్లు చేసి అంజన్‌ రావు ఇంటికి రప్పించారు. అధికారులు ఓపికతో ఉన్నప్పటికీ వారిని రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు గేటు పైకి ఎక్కారు. ఓ దశలో అధికారులను తొసేస్తూ గూండాగిరీ చేశారు. సీజ్‌ చేసిన డబ్బు సంచిని అధికారులు బయటకు తీసుకువస్తుండగా.. బీజేపీ కార్యర్తలు దాన్ని లాక్కొన్నారు. డబ్బు కట్టలను పైకి చూపిస్తూ అక్కడ్నుంచి పరుగులు తీశారు.                    

పట్టపగలు ఇంత రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా బీజేపీ నాయకులు మాత్రం పోలీసులనే ఉల్టా  దబాయించారు. సీజ్‌ చేసిన 18 లక్షల 67 వేలల్లో బీజేపీ కార్యకర్తలు 12 లక్షల 87 వేలు ఎత్తుకెళ్లగా.. పోలీసుల వద్ద 5లక్షల 80 వేలు మాత్రమే మిగిలాయి. పైగా పోలీసులే డబ్బులు తీసుకువచ్చి అంజన్‌ రావు ఇంట్లో పెడుతున్నారంటూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.  రఘునందన్‌ రావుకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇతర కీలక నేతలు సిద్దిపేటకు వచ్చి గొడవ సృష్టించారు. అటు  బీజేపీ నేతల ఆరోపణలను సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌ ఖండించారు. దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అంజన్ రావు ఇల్లు కేంద్రంగా డబ్బు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలు డబ్బు లాక్కెల్లిన ఘటన మొత్తం వీడియో రికార్డింగ్‌ అయిందని.. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 దుబ్బాక ఉప ఎన్నికను నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు పార్టీలకు అతీతంగా తనిఖీలు చేస్తున్నారు. టీఆర్ఎస్‌ నేత, సిద్దిపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజనర్సు ఇంట్లోనూ సోదాలు చేశారు. అటు మంత్రి హరీశ్‌ రావు వాహనాన్ని భూంపల్లి చౌరస్తా వద్ద ఆపి తనిఖీ చేశారు. ఇప్పటివరకు మంత్రి హరీశ్‌ రావు వాహనాన్ని మూడుసార్లు పోలీసులు తనిఖీ చేశారు. మద్యం నిల్వం చేశారన్న అనుమానంతో చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌ లో పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌, టీఆర్ఎస్‌ నేత నారాయణరెడ్డి ఇంట్లోనూ సోదాలు జరిపారు. కానీ ఎలాంటి బాటిళ్లు దొరకలేదు. ఇప్పటివరకు టీఆర్ఎస్‌ అభ్యర్థి సుజాత వాహనాన్ని మూడుసార్లు, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి వాహనాన్ని కూడా రెండుమూడు సార్లు తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఇంట్లో అధికారులు సోదాలు చేస్తుంటే బీజేపీ నేతలు మాత్రం తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు.

అటు ఎన్నికల వేళ తమ గుట్టంతా రట్టయినా బీజేపీ నేతలు, వారికి వంతపాడే మీడియా నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. సిద్దిపేటలో నోట్ల కట్టలతో బీజేపీ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా.. వీ6 ఛానల్‌ నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నది. మొన్నటికి మొన్న రూ. 40 లక్షలు, తాజాగా రూ. 18 లక్షలు ఇలా లక్షలాది రూపాయలతో కమలం అండ్ కో దొరికిపోతున్నా… సదరు ఛానల్ మాత్రం డబ్బుల పార్టీలకే కొమ్ముకాస్తున్నది. ఇంత జరుగుతున్నా బీజేపీని వెనకేస్తున్న వీ6 ఛానల్.. విశ్వసనీయతను జనం ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.