19.8 C
Hyderabad
Friday, December 4, 2020

దేశంలో ఒక్కరోజులో 40వేల 425 కరోనా‌ కేసులు

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. వారం నుండి రోజూ 32 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 40వేల 425 పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 11లక్షల 18వేల 43కు చేరింది. ఈ మహమ్మారితో నిన్నటికి నిన్న 681 మంది ప్రాణాలు కోల్పోగా..  దేశవ్యాప్తంగా మొత్తం మరణాలు 27వేల 497కు పెరిగాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 3లక్షల 90వేల 459మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో 7లక్షల 87మంది మంది బాధితులు కోలుకున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...