దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 44 వేల 489 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 92లక్షల 66వేల 706కు చేరిందని ప్రకటించింది కేంద్ర ఆరోగ్యశాఖ. నిన్న ఒక్కరోజే 524మంది చనిపోగా..మొత్తం మృతుల సంఖ్య లక్షా 35వేల 233కి చేరినట్టు పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 4లక్షల 52 వేల 344యాక్టివ్ కేసులుండగా.. వైరస్ బారిన పడి 86 లక్షల 79వేల 138మంది కోలుకున్నట్టు తెలిపింది.