భారత్ ను కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. నిన్నటికి నిన్న 55వేల 342 కొత్త కేసులు నమోదు కాగా ..మొత్తం కేసుల సంఖ్య 71లక్షల 75వేల 881కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24గంటల్లో 706మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 09వేల 856కు చేరిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 8లక్షల 38వేల 729యాక్టివ్ కేసులుండగా.. కోలుకున్న వారి సంఖ్య 62లక్షల 27వేల 296గా ఉన్నట్టు పేర్కొంది కేంద్రం.