25.4 C
Hyderabad
Monday, July 13, 2020

దేశంలో 24 గంటల్లో 7 వేల పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా ఆరు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 6977 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 154 మంది బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,845కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 77,103 యాక్టివ్‌గా ఉండగా, 57,720 మంది బాధితులు కోలుకున్నారు. ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన 4021 మంది మృతిచెందారు. ఒకే రోజు సుమారు ఏడు వేల పాజిటివ్‌ కేసులు నమోదవడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్‌ పదో స్థానానికి చేరింది. ఇప్పటివరకు ఇరాన్‌ ఆ స్థానంలో ఉన్నది. 

దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 50231 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్‌తో 1635 మంది మరణించారు. 16,277 పాజిటివ్‌ కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 111 మంది మరణించారు. ప్రధాని సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో ఇప్పటివరకు 14,056 కరోనా కేసులు నమోదయ్యాయి. అక్కడ 858 మంది మృతిచెందారు. ఢిల్లీ 13,418 కేసులు, రాజస్థాన్‌ 7,028 పాజిటివ్‌ కేసులు, మధ్యప్రదేశ్‌ 6,665, ఉత్తరప్రదేశ్‌ 6268 పాజిటివ్‌ కేసులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...