దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 70వేల 589 పాజిటివ్ కేసులు వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య61వేల45వేల292కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజులోనే 776మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 96వేల 318కి చేరిందని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9లక్షల 47వేల 576 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 51లక్షల 1వేయ్యి 398 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు కూడా అదే స్థాయిలో గణనీయంగా పెరుగుతుండడం శుభపరిణామం అంటున్నారు అధికారులు
