దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678 కు చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడచిన 24 గంటలలో 86వేల821 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 63లక్షల 12 వేల 585కు చేరిందని వెల్లడించింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 52లక్షల73వేల202కి పెరగగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 9లక్షల40వేల705గా ఉన్నట్టు తెలిపింది.
