27 C
Hyderabad
Friday, December 4, 2020

దేశంలో 24 గంట‌ల్లో 49 వేల కరోనా కేసులు

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. వారం నుండి రోజూ 35 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 49,310 మంది క‌రోనా పాజిటివ్‌లుగా నిర్ధార‌ణ అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 30,601 మంది చ‌నిపోయారు. నిన్న ఒకేరోజు కొత్త‌గా 720 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.  

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....