19.8 C
Hyderabad
Friday, December 4, 2020

దేశంలో 25లక్షలు దాటిన కరోనా‌ కేసులు

భారత్‌  లో కరోనాకల్లోలం కొనసాగుతోంది. దేశంలో పాజిటీవ్‌ కేసుల సంఖ్య 25లక్షలు దాటింది. గడిచిన 24గంటల్లో 65వేల 2 కొత్త కేసులు బయటపడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటీవ్‌ కేసుల సంఖ్య 25లక్షల26వేల193కి చేరినట్టు వెల్లడించింది. నిన్నటికి నిన్న 996 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 49వేల 36కి చేరుకుందని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18లక్షల8వేల937కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6లక్షల68వేల220గా ఉంది. దేశవ్యాప్త మరణాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా .. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీ ఉన్నాయి. దేశంలో ప్రతి మిలియన్‌ మందికి రోజుకు 603 మందికి పరీక్షలు జరుగుతుండగా  అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో  2,822 మందికి పరీక్షలు చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...