దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 96వేల424 కేసులు బయటపడగా.. మొత్తం కేసుల సంఖ్య 52లక్షల14వేల678కు చేరుకుంది. నిన్నటికి నిన్న 1వెయ్యి172 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 84వేల372దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 41లక్షల12వేల552కు చేరుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 10లక్షల17వేల754గా ఉందని వెల్లడించింది.ఇక కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని.. మరణాల రేటు పడిపోయిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్యశాఖ