భారత్ లో కరోనా కల్లోలానికి ఇప్పటంతలో కళ్లెం పడేలా కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 68లక్షలు దాటగా.. మరణాల సంఖ్య లక్షా 5వేలు దాటింది. నిన్నటికి నిన్న కొత్తగా 78వేల 524కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 68లక్షల 35వేల 665కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.గత 24గంటల్లో 971 మంది మృతి చెందడంతో .. మొత్తం మరణాల సంఖ్య 1లక్షా 05వేల 425 కు చేరినట్టు తెలిపింది. ఇక రికవరీల సంఖ్య 58లక్షల 27వేల705కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 10లక్షల 5వేల526గా ఉంది.