కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. దేశవ్యాప్త సమ్మెతో రహదారులు బోసిపోయాయి. తెల్లవారుజామునే రోడ్లెక్కిన 25కోట్ల మంది కార్మికులు..మోడీ సర్కారు తీరుపై మండిపడుతున్నారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ, కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ఎన్పీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్దరించాలంటున్నారు. ఈ సమ్మెలో స్కీమ్ వర్కర్లు, గృహ, నిర్మాణ, బీడీ కార్మికులు, హాకర్లు, వెండార్లు, వ్యవసాయ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికుల సమ్మెకు చాలా రాష్ట్రాల్లోబ్యాంకు ఉద్యోగులు, ఆటో, టాక్సీ డ్రైవర్లు మద్దతు ప్రకటించడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు.