19.5 C
Hyderabad
Friday, November 27, 2020

దేశవ్యాప్తంగా ఘనంగా దసరా సంబరాలు

రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఆయుధ, వాహన  పూజలు చేసి.. . అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా సీఎం కేసీఆర్..ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిపై రాముడు సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి జరుపుకుంటామని సీఎం అన్నారు. అటు..అమ్మవారి దీవెనలతో..రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని సీఎం ఆకాంక్షించారు. కరోనా మహమ్మారిని అధిగమించేలా అమ్మవారు.. ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థించారు.

వరద సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, వాళ్ళ కుటుంబసభ్యులకు సీఎస్ సోమేశ్ కుమార్‌ దసరా శుభాకాంక్షలు తెలిపారు. వీళ్లందరికీ అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సహాయక చర్యల్లో భాగంగా 8 వేల మంది బాధితుల ఇళ్లకు వెళ్లి సాయం అందించారని తెలిపారు. ఒక్కో ఇంటికి 10 వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు మొత్తం 120 కోట్లు పంచి.. దసరా పండగ రోజు బాధితుల ముఖాల్లో నవ్వులు చిందెలా చేశారన్నారు.  

కరీంనగర్ లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కరీంనగర్ లోని స్థానిక ఆలయంలో మంత్రి గంగుల కమలాకర్..ప్రత్యేక పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు చేశారు. అనంతరం కరీంనగర్ వాసులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అటు కరీంనగర్ పట్టణం అంబేడ్కర్ స్టేడియంలో నగర పాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో లేజర్ షో, క్రాకర్ షో, రావణ దహనం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బతుకమ్మన  విశిష్టతను, కరీంనగర్ చరిత్రను వివరిస్తూ సాగిన లేజర్ షో… కార్యక్రమానికి హైలెట్ గా నిలిచింది. ఆకాశంలో మిరుమిట్లు గొలిపే విధంగా టపాసుల క్రాకర్ షో ఆకట్టుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో విజయదశమిని పురస్కరించుకుని కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ని దర్శించుకున్నారు. MLA వనమా వెంకటేశ్వరావు  అమ్మవారిని  దర్శించుకొని  పూజలు నిర్వహించారు.

వరంగల్ జిల్లాలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వరంగల్ ఉర్సు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉర్సుగుట్టపై రావణవధ కార్యక్రమం జరిగింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ, ఎమ్మెల్యే, వరంగల్ నగర మేయర్.. రావణవధ కార్యక్రమంలో పాల్గొన్నరు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ..ఉత్సవాలు నిర్వహించామని ఉత్సవకమిటీ తెలిపింది.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి, దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి.  స్వామివారు శ్రీరాజస్వామి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరాను పురస్కరించుకొని.. వేములవాడ రాజన్నకు, రాజరాజేశ్వరి దేవికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దసరా ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలో ఆయుధపూజ చేశారు. ఇక భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు..

నిర్మల్ జిల్లా కేంద్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బంగల్ పేట మహాలక్ష్మీ ఆలయంలో మంత్రి ఇంద్రరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  అటు సుప్రసిద్ధ బాసర సరస్వతీ ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నులపండువగా జరిగాయి. అమ్మవారు సిద్ధిదాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచే అర్చకులు మూల మూర్తులకు హోమం, నైవేద్యాలు, తదితర ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం అమ్మవారికి పల్లకిసేవ, అపరాజిత శమీపూజ నిర్వహించారు. ఇక ఆలయ దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దసరా రోజున చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు చేయించడంతోపాటు మొక్కులు చెల్లించుకున్నారు. అటు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. 

దసరా ఉత్సవాలు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ లోని గోండు రాజుల కోటలో ఘనంగా జరిగాయి. దసరా రోజున తమ పూర్వికులను పూజించడం ఆత్రం వంశస్తులకు ఆచారంగా వస్తోంది.  గోండుల సంప్రదాయం ప్రకారం డోలు వాయిస్తూ రాజుల కోటలో చేరుకొని వారి తాతల సమాధి వద్ద పూజలు నిర్వహించి ప్రతీక జెండా ఎగరవేశారు. తమ గోండు రాజుల చారిత్రక కట్టడాలను గుర్తించి, తమ అభివృద్ధికి నాలుగు కోట్ల రూపాయల నిధులు కేటాయించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్రం వంశస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీశైల భ్రమరాంబికాదేవి సిద్దిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అటు ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం, అమ్మవారికి చండీయాగం నిర్వహించారు.

అటు వికారాబాద్ జిల్లా తాండూర్ లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. హిందు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. దసరా పండుగ కావడంతో ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. వేకువజామున 3 గంటల నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు..  దసరాను పురస్కరించుకొని నిజరూపంలో దర్శనమిస్తోంది. టిఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేకే కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నరు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో వాహన పూజలను నిలిపివేశారు.

విజయదశమి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రామాయన్ మేళ ఘనంగా జరిగింది. దసరా ఉత్సవాలలో భాగంగా రాజస్థాని ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో 48వ రామాయన్ మేళ ఉత్సవం నిరాడంబరంగా జరిగింది. కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. వేలాది మందితో కొనసాగే రావన్ దహనం.. కోవిడ్ నిబంధనలతో కొంతమందితోనే నిర్వహించామని నిర్వాహకులు చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...