దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బీహార్, యూపీ, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, పశ్చిమబెంగాల్, గుజరాత్, గోవా, కేరళ, కర్నాటక రాష్ర్టాలు అతలాకుతలం అవుతున్నాయి. వరదలు పోటెత్తడంతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. బీహార్,యూపీలో పిడుగుపాట్లకు 28 మంది బలయ్యారు. బీహార్‌లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాట్ల కారణంగా 15 మంది మృతి చెందగా.. బాధిత కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు సీఎం నితీష్ కుమార్. ఇదిలా ఉంటే రానున్న మూడు నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది. ఐఎండీ హెచ్చరికలతో ఆయా రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి.