కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పంజాబ్, కర్ణాటక రైతులు హస్తినను ముట్టడించారు. ఇండియా గేట్ దగ్గర ట్రాక్టర్ దగ్ధం చేసి నిరసనలు తెలిపారు. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ మధ్య రహదారిపై బైఠాయించిన అన్నదాతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటు అమృత సర్ – న్యూఢిల్లీ రైల్వే ట్రాక్ పైకి చేరుకున్న వందలాది మంది రైతులు, ధర్నాకు దిగగా..రైళ్ల రాకపోకలను నిలిపేశారు అధికారులు.