మూడేండ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఇస్రో సైంటిస్ట్ తపన్ మిశ్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆయన తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. మే 23, 2017లో ఇస్రో హెడ్ క్వార్టర్ లో నిర్వహించిన ప్రమోషన్ ఇంటర్వ్యూ సందర్భంగా తనపై విష ప్రయోగం జరిగిందన్నారు. స్నాక్ తీసుకునే సమయంలో దోశ, చట్నీలో తక్కువ మొత్తంలో అర్సెనిక్ ట్రై ఆక్సైడ్ అనే రసాయానాన్ని కలిపారన్నారు. ఈ విషయాన్ని హోం శాఖలో పనిచేసే సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ తనకు జులై 2017లో చెప్పారన్నారు. విష ప్రయోగం అనంతరం బ్రీతింగ్ సమస్యతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనట్టు మిశ్రా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తపన్ మిశ్రా ఇస్రోలో సీనియర్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు.