19.8 C
Hyderabad
Friday, December 4, 2020

నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: గులాం న‌బీ ఆజాద్‌

సీడబ్ల్యూసీ వర్చువల్‌ మీటింగ్‌ హాట్ హాట్‌గా జరుగుతోంది. ఈ భేటీలో పార్టీలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించాల్సిన నేతలు పరస్పర విమర్శలకు దిగారు. 23మంది సీనియర్ల లేఖలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాహుల్‌ గాంధీని కడిగిపారేశారు కపిల్‌ సిబల్‌, గులాంనబి ఆజాద్‌ లు. అసమ్మతి నేతలు బీజేపీ ఏజెంట్లంటూ రాహుల్ వ్యాఖ్యానించడంపై ఫైరయ్యారు. బీజేపీ ఏజెంట్స్‌ అని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. లేఖ రాయడానికి నేతల తీరే కారణమంటున్నారు ఆజాద్‌.  ట్విట్టర్‌ వేదికగా రాహుల్‌ పై విమర్శలు చేసిన మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్  కొద్ది నిమిషాల్లోనే  యూటర్న్‌ తీసుకున్నారు. 30ఏళ్లు పార్టీ కోసం కష్టించిన పని చేసిన తమనే తప్పుబడతారా అంటూ ట్విట్టర్‌ లో ఏకి పారేసిన ఆయన.. ఆ ట్వీట్‌ ను తొలగించారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...