నూతన జాతీయ విద్యా విధానంతో విద్యార్దులకు మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోడీ. తమకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్‌ను ఎంచుకునే స్వేచ్చ విద్యార్ధులకు ఉంటుందన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డెస్టినేషన్‌గా మారుతుందన్నారు. గౌహతి ఐఐటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన విద్యార్ధులకు పలు సూచనలు చేశారు.