దేశ రాజధాని సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఉత్తర్ప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపుర్ వద్ద రైతుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేస్తున్న ఉద్యమానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఎముకల కొరికే చలిలోనూ వెన్నువెరవని రైతుల కార్యదీక్షకు ప్రతి ఒక్కళ్లూ సలాం చేస్తున్నారు.ఆందోళనలు ఉద్రిక్తంగా మారడంతో కేంద్రం దిగొచ్చింది. ఎల్లుండి రైతులను చర్చలను ఆహ్వానించిన కేంద్రం..ఆ షెడ్యూల్ ను ఇవాళ మధ్యాహ్నంకు మార్చింది. విజ్ఞాన్ భవన్ లో 3 గంటలకు రైతు నేతలతో భేటీ కానున్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.