19.3 C
Hyderabad
Monday, January 18, 2021

నేరెడ్‌మెట్ లో‌ విషాదం…

నగరంలోని నేరెడ్‌మెట్‌లో నిన్న సాయంత్రం బాలిక అదృశ్య‌మైన ఘ‌ట‌న విషాదాంతంగా మారింది. సుమేధ‌(12)‌ అనే బాలిక నిన్న సాయత్రం 7 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిన పోయిన బాలిక స్థానికంగా ఉన్న బండ‌చెరువులో మృత‌దేహ‌మై తేలింది. బాలిక మ‌ర‌ణ‌వార్త విన్న త‌ల్లిదండ్రులు బోరున విల‌పిస్తున్నారు. సుమేధ మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురికీ త‌ర‌లించారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌పై బ‌య‌ట‌కు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం గాలించిన త‌ల్లిదండ్రుల‌కు నిరాశే ఎదురైంది. సైకిల్‌పై నుంచి ప్ర‌మాద‌వ‌శాత్తు నాలాలో ప‌డిపోయి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news

బట్టతలకు రాకుండా ఉండాలంటే..

బట్టతల.. ఈ మాట వింటేనే చాలామందికి భయమేస్తుంది. ఒక్కసారి బట్టతల వచ్చిందంటే ఇక అంతే.. జుట్టంతా ఎక్కడ రాలిపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. అసలీ బట్ట తల ఎలా వస్తుంది?...

ఫ్లిప్‌కార్ట్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ సేల్స్

రిపబ్లిక్ డే వస్తుందంటే ఈ కామర్స్ సైట్లు భారీగా ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ సారి కుడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు డిస్కౌంట్ సేల్స్‌ను అనౌన్స్ చేశాయి. అమెజాన్...

కోవిడ్19 సోకిన గబ్బిలం కుట్టిందన్న చైనా సైంటిస్ట్

కోవిడ్-19 సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్లు వూహన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు చెప్పారని ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది.

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీనే బెస్ట్

అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కన్నా గుజరాత్ లోని కెవాడియాలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ కే ఎక్కువమంది టూరిస్టులు వచ్చారని ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండేళ్ల క్రితం...