దేశంలో ప్రధాన పండుగల సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు రైల్వేబోర్డు చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. కరోనా కారణంగా మార్చి 22 నుంచి సాధారణ ప్రయాణికుల రైళ్లు నడుపటం లేదు. తాజాగా పండుగ సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడుపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో కరోనా సమస్య తక్కువగా ఉంటే 200కంటే ఎక్కవ రైళ్లనే నడుపుతామని వీకే యాదవ్ తెలిపారు.