పశ్చిమ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో.. తెలంగాణ, ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం తెలిపారు. వాయువ్య దిశగా కదులుతున్న తీవ్ర వాయుగుండం ఏపీలోని కాకినాడ, తుని తీరం తాకిందన్నారు. ఈ వాయుగుండం విశాఖ పట్నంకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. దీంతో గంటకు 55 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.