కశ్మీర్ లో ఉగ్రవాదుల కుట్రను జవాన్లు భగ్నం చేశారు. కీరన్ సెక్టార్ లో పాక్ ఆర్మీ సాయంతో అక్రమంగా సరఫరా అవుతున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు ఏకే 47 రైఫిళ్లు, 8 మ్యాగ్జిన్లు, 240 ఏకే రైఫిల్ అమ్యూనిషన్ ను స్వాధీనం చేసుకున్నారు. కిషన్ గంగా నది సమీపంలో సైనికులు గాలింపు చర్యలు చేపట్టడంతో .. ఈ కుట్ర బయటపడింది. గంగా నదికి అవతల వైపు పీవోకే ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు ఓ ట్యూబ్ ను తాడుకు కట్టి ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు.