17.6 C
Hyderabad
Saturday, November 28, 2020

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ..  పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందన్నారు.  నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయని తెలిపారు. సెప్టంబర్‌ 25 నుంచి ఫేస్‌లెస్‌ అప్పీల్‌ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు ప్రధాని.   ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ లతో పాటు పలువురు చార్టర్డ్‌ అకౌంటెంట్లు పాల్గొన్నారు

- Advertisement -

Latest news

Related news

ఎన్నికల ప్రచారంలో కల్వకుంట్ల కవిత జోరు

పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రూపొందించిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. దూరదృష్టితో, చక్కటి ప్రణాళికతో.. కేంద్రం నుంచి ఎలాంటి...

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...