డిసెంబర్ 31న పార్టీ స్థాపిస్తున్నట్టు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఆ పనుల్లో వేగం పెంచారు. ఈ క్రమంలో రజనీ ప్రత్యేక సలహాదారులుగా అర్జున్మూర్తి, తమిళురివి మణియన్లను నియమించారు. కొడంబాక్కంలోని రాఘవేంద్ర మ్యారేజ్ హాల్ లో పార్టీ ఏర్పాటుపై ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీని ఎక్కడ ప్రారంభించాలో, సమావేశం ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చలు జరిపారు.
పార్టీ ఏర్పాటుపై గత నెల 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మక్కల్ మంగ్రం ముఖ్య నేతలతో సమావేశమైన రజనీ రాజకీయ ప్రవేశంపై పలు సూచనలు తీసుకున్నారు. బెంగళూరు వెళ్లి తన సోదరుడు సత్యనారాయణ ఆశీస్సులు తీసుకొని రెండు రోజుల క్రితం చెన్నై తిరిగి వచ్చారు. వచ్చీ రాగానే ఆజన ప్రత్యేక సలహాదారుడు తమిళురివి మణియన్ రజనీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.