పోలీసులకు అహంభావం ఉండకూడదన్నారు ప్రధాని మోడీ. ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడిన ఆయన.. ప్రొబేషనరీ ఆఫీసర్లను ఉద్దేశించి స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు. కరోనా కష్టకాలంలో పోలీసుల సేవలను చరిత్రలో లిఖించవచ్చన్నారు. ప్రజా సేవలో ఉండే అధికారులు ఆరోగ్యంగా ఉండాలన్న మోడీ.. పనిభారం, ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటించాలన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా, సహాయక మంత్రి కిషన్రెడ్డి, జితేంద్రసింగ్ ఈ పాల్గొన్నారు.