కేంద్రం నిలిపేసిన ప్రధాని ఫసల్ బీమా యోజన పథకాన్ని కొనసాగించాలన్నారు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్. రాజ్యసభలో రైతుల సమస్యలపై మాట్లాడిన ఆయన.. బీమా రాక అన్నదాతలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. తెలంగాణకు రావాల్సిన రూ. 511కోట్ల ఫసల్ బీమా యోజన బకాయిలను రిలీజ్ చేయాలని కోరారు. వాణిజ్య పంటలకు రైతుల ప్రీమియంను కేంద్రమే భరించాలన్నారు ఎంపీ లింగయ్య.